- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భజరంగ్ దళ్‌పై వ్యాఖ్యలు.. మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బజరంగ్‌దళ్‌ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. సంగ్రూర్‌కు చెందిన ఆ సంఘం వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ స్థానిక జిల్లా కోర్టులో ఖర్గే పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు సివిల్ జడ్జి రమణదీప్ కౌర్, ఖర్గేకు సమన్లు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ బజరంగ్‌దళ్‌ని దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని సంగ్రూర్ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ సంస్థలపై నిషేధం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనడం రాజకీయ రగడకు తెరతీసింది. ఇది హిందూ దేవుడు హనుమంతుడిపై, ఆయన భక్తులపై జరిగిన దాడి అని బీజేపీ విమర్శలు గుప్పించింది.
Read More: కర్ణాటక కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని వారి డిమాండ్