CM Revanth Reddy : హీర్యానాయక్ కు మెరుగైన వైద్యం అందించండి : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

by M.Rajitha |   ( Updated:2024-12-12 10:55:01.0  )
CM Revanth Reddy : హీర్యానాయక్ కు మెరుగైన వైద్యం అందించండి : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన(Lagacharla Issue) గురించి తెలిసిందే. ఈ ఘటనలో అరెస్టయిన రైతులు ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా వీరిలో హీర్యానాయక్(HeeryaNayak) ఈరోజు గుండెపోటు రాగా ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి(Panjagutta NIMS Hospital)కి తరలించారు. అయితే ఈ తరలించే క్రమంలో రైతు చేతికి బేడీలు వేసి తీసుకు వెళ్ళడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే హీర్యానాయక్ కు మెరుగైన వైఆద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ వైద్యులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో రైతుకు ఎమర్జెన్సీ విభాగంలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story