- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు పలు చోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ గేటు వద్దే బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అధికారం అండతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని కొంత మంది పోలీసు అధికారుల చేత ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసీ అక్కడి నుండి తరలించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తే సీఎం కేసీఆర్ కు కోపం వస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ రాచరిక పాలన నడుస్తోందని కేసీఆర్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని అన్నారు. బెదిరిస్తే భయపడే వాళ్లు ఎవరూ లేరని బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందంతోనే తమ పార్టీకి సంబంధించిన వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.