- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్‌పై వేటు తొందర పాటు చర్య.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా.. తొందర పాటు చర్యగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తొందర పాటు పనికి రాదని, చట్ట ప్రకారమే నడుచుకోవాలని కేంద్రానికి సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాహుల్ గాంధీపై వేటు వేయడం సీరియస్‌గా ఆలోచించాలని, సభ్యత్వం రద్దుపై ప్రజాస్వామిక చర్యకు ఆటంకం కలుగుతుందని అన్నారు. రిప్రసెంటేషన్ పీపుల్స్ యాక్ట్‌లోని చట్టం ప్రకారం ఎవరైన ఒక వ్యక్తిపైన కోర్టు శిక్షవేసి అమలు చేస్తే అతడిని డిస్ క్వాలిఫై చేయవచ్చని తెలిపారు.
పార్లమెంట్ సభ్యత్వం రద్దు ఎవరు నిర్ణయిస్తారనేది ఈ చట్టంలో లేదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ప్రెసిడెంట్‌కు ఈ నిర్ణయం ఉంటదని అన్నారు. రాహుల్ విషయంలో వెంటనే నేరంగా చూసి శిక్ష వేయడం సరికాదని, దాదాపు అందరూ రాజకీయ నాయకులు ఇలాంటి కేసుల్లో చిక్కుకుంటారని వివరించారు. కేంద్రం సమీక్షించుకుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు నిర్ణయాన్ని ఆపాలని, చట్టప్రకారం నడుచుకోవాలి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామిక వాదులు దీనిపై స్పందించాలని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వాలు నడవాలని సూచించారు.