వైఎస్ జగన్‌ వివాదాస్పద కామెంట్స్.. రామగిరి ఎస్సై స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2025-04-09 04:03:55.0  )
వైఎస్ జగన్‌ వివాదాస్పద కామెంట్స్.. రామగిరి ఎస్సై స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) వివాదాస్పద కామెంట్స్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తలెత్తిన వివాదంపై పోలీసులను ఉద్దేశించి జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులను బట్ట ఊడదీస్తామని హెచ్చరించారు. దీంతో రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(Ramagiri SI strong warning) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి, రన్నింగ్, పరీక్షలు పాసై, వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని, ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదేం అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయితీగా ఉద్యోగం చేస్తామని, ప్రజల ప్రక్షాన నిలబతామని చెప్పారు. అడ్డదారులు తొక్కమని, జాగ్రత్తగా మాట్లాడాలని జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఎస్సై సుధాకర్ యాదవ్ హెచ్చరించారు.

Next Story

Most Viewed