తెలంగాణ వచ్చాక విద్య వ్యవస్థ నాశనం.. ప్రొఫెసర్ హరగోపాల్

by Javid Pasha |
తెలంగాణ వచ్చాక విద్య వ్యవస్థ నాశనం.. ప్రొఫెసర్ హరగోపాల్
X

దిశ , తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ నాశనమైందని , విద్యావ్యవస్థలో 20 నుంచి 30 ఏళ్లు రాష్ట్రం వెనకబడిందని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు . శనివారం సుందరయ్య విజ్ఞానభవన్ లో విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి విద్యారంగపై సమిక్షించే సమయం కూడా లేదని అన్నారు . విద్యారంగం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదన్నారు. దీంతో తెలంగాణలోనే విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు . ప్రాథమిక విద్య , ఉన్నత విద్య తో పాటు విద్యావ్యవస్థ ఆగమైందని అన్నారు . రాష్టంలో కేజీ టూ పీజీ విద్యను అమలుచేస్తామని ఎన్నికల హామీని పూర్తిగా విస్మరించారని గుర్తు చేసారు .

రాష్టంలో విద్య వ్యవస్థ మళ్లీ ముందుకు వెళ్లాలంటే వచ్చే ప్రభుత్వం దశాబ్దం పాటు కష్టపడితే తప్ప బాగుపడే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు కనబడే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసారు . వర్శిటీల్లో వైస్ ఛాన్స్ లర్లకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు కుడా సమయం దొరకట్లేదంటే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రశ్నించే వారిపై ప్రభుత్వం ఉప చట్టం అమలు చేయడం ,అలాగే వారిని ప్రభుత్వం జైల్లో పెట్టడం దుర్మార్గమని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు . ఈ ఉప చట్టాలు రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. తెలంగాణలో ప్రభుత్వం 400 మందిపై ఉప చట్టం కేసులు పెట్టిందని.. ప్రభుత్వం ఎందుకు కేసులు పెడుతుందో చెప్పడం లేదన్నారు. ఎన్నో మంచి తీర్పులు ఇచ్చిన జస్టిస్ సురేష్ పై ఉప కేసు పెట్టడం ఏమిటని అయన ప్రశ్నించారు.

Advertisement

Next Story