ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 19 |
ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 10వ తేదీన మాత్రమే రాష్ట్రంలో ఆమె పర్యటిస్తుందని, ఒక్క రోజుకే ఆమె ప్రోగ్రామ్‌లు పరిమితమవుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తొలుత రూపొందించిన ముసాయిదా షెడ్యూలు ప్రకారం ఈ నెల 6 రాత్రికే నగరానికి చేరుకుని 7, 8 తేదీల్లో కామారెడ్డిలో బహిరంగసభ, కూకట్‌పల్లిలో రోడ్ షో, చౌటుప్పల్ లేదా భువనగిరిలో సభలు, వరంగల్‌లో మరో సభలో పాల్గొనే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కానీ అధికారికంగా ఏఐసీసీ నుంచి ఆదివారం అందిన సమాచారం ప్రకారం 10న కామారెడ్డిలో జరిగే బహిరంగసభలో పాల్గొని ఆ తర్వాత తాండూరులో జనజాతర సభలో ప్రసంగించి సాయంత్రం తర్వాత షాద్‌నగర్‌లో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నట్లు తెలిపాయి.

రాహుల్‌గాంధీ ఆదివారం నిర్మల్, ఆలంపూర్ సభల్లో ఇప్పటికే పాల్గొన్నందున ఈ నెల 9న మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు ఏఐసీసీ ద్వారా అందిన సమాచారం. రాహుల్‌గాంధీ సెకండ్ ట్రిప్‌లో భాగంగా ఈ నెల 9న ఉదయం కరీంనగర్‌లో జరిగే జనజాతర సభలో పాల్గొని మధ్యాహ్నం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఇద్దరు అగ్రనేతల టూర్‌లు ఖరారు కావడంతో మిగిలిన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే, సీఎం రేవంత్ పాల్గొనే కాంగ్రెస్ సభలను గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. :

సీఎం రేవంత్ పాల్గొనే సభలు:

మే 6న: ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లలో రోడ్డు షో లు

మే 7న: నర్సాపూర్ జనజాతర సభ, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ లలో రోడ్ షో లు

మే 8న: ఆర్మూరు, నిజామాబాద్‌లలో రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగులు

మే 9న: రాహుల్‌గాంధీ కరీంనగర్, సరూర్‌నగర్ స్టేడియంలలో జనజాతర సభలు

మే 10న: ప్రియాంకాగాంధీ కామారెడ్డి, తాండూరులలో జనజాతర సభలు, షాద్‌నగర్ రోడ్ షో

Next Story

Most Viewed