ఇంటర్ ఎగ్జామ్స్‌కు అంతా రెడీ.. ఈ సారి వాళ్లకి కూడా ప్రింటెడ్ పేపర్స్

by karthikeya |
ఇంటర్ ఎగ్జామ్స్‌కు అంతా రెడీ.. ఈ సారి వాళ్లకి కూడా ప్రింటెడ్ పేపర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ పరీక్షలకు బోర్డు అధికారులు సంసిద్ధమవుతుతున్నారు. ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఆఫీసర్లు ప్రక్రియను క్రమంగా వేగవంతం చేయనున్నారు. ఈసారి మరాఠీ, హిందీ మీడియం ప్రశ్నపత్రాలను మ్యానువల్ పద్ధతిలో చేతిరాతతో అందించడం కాకుండా ముద్రణ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

గత విధానానికి స్వస్తి

మరాఠీ మీడియంలో సుమారు 300 మంది వరకు, హిందీ మాధ్యమంలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు మరాఠీ, హిందీ మీడియంలో ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్‌కు చేతి రాతతో తయారుచేసిన ప్రశ్న పత్రాలను అందించేవారు. కానీ, ఈ విద్యాసంవత్సరం నుంచి ఆయా మీడియం స్టూడెంట్స్‌కు ఇతర మాధ్యమ విద్యార్థుల మాదిరిగానే ప్రింటింగ్ చేసిన ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. కన్నడ మాధ్యమంలో దాదాపు 50 మంది విద్యార్థులున్నా వారికి ప్రశ్నపత్రాలను ముద్రించి ఇస్తున్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాటు చేయాలని బోర్డు ఆఫీసర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Next Story