- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. పోలీసుల అదుపులో సైఫ్
దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్మో సపోర్ట్‌తో ప్రీతికి చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నిందితుడు సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.
అనంతరం ప్రీతి గదిని పరిశీలించిన పోలీసులు, గదిలో మత్తు మందు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక, మత్తు మందు మోతాదుపై ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ తీసుకున్నట్లు గుర్తించారు. ప్రీతిని అవమానించేలా వాట్సాప్‌లో సైఫ్ చేసిన చాటింగ్ వివరాలను బయటకు తీశారు. సైఫ్‌పై గతంలోనే ప్రీతి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ సైఫ్ పిలిచి మందిలించాడని పోలీసులు నిర్ధారించారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ప్రీతి తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకున్నట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. దీంతో ప్రీతి తీవ్రమనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.