- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prakash Raj: సమంతా విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. మంత్రికి ప్రకాశ్ రాజ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కొండా సురేఖ ట్రోలింగ్ వ్యవహారం అనూహ్యంగా కొత్త మలుపు తీసుకుంది. తనపై ట్రోలింగ్ జరగడం వెనుక బీఆర్ఎస్సే ఉందని ఆరోపించిన కొండా సురేఖ.. కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడిపోయారంటూ తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్ నుంచి మూవీ ఇండస్ట్రీ వైపు మళ్లాయి. దీంతో సినీ, రాజకీయ వర్గాల్లో కొండా సురేఖ కామెంట్స్ దుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో సమంత, నాగచైతన్య డైవర్స్ అంశంతో పాటు సినీ హీరోయిన్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. 'ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా' అంటూ ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనే చర్చ జోరందుకుంది.