- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి: కేఏ పాల్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డ్రామా నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్ కూతురు కవితకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అదే ప్రీతి విషయంలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదన్నారు. గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని లేదంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిని సైతం విడుదల చేయాలన్నారు. ఈడీ అంటే కోర్టు అని కవిత కోర్టునే ఇంటికి రమ్మంటోందని ఎద్దేవా చేశారు.
సోనియా, రాహుల్ గాంధీ లాంటీ వారు ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి గుర్తు చేశారు. కేసీఆర్ కళ్లు నెత్తిమీదకు వచ్చాయని ఈ తొమ్మిదేళ్లలో కోదండరామ్, మందకృష్ణ మాదిగతో పాటు మరెందరో ఉద్యమకారులను సీఎం ఇబ్బందుల పాలు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కోర్టులకు లాగుతున్నానని తన సోదరుడి హత్య కేసులో తనను అక్రమంగా ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తన హత్యకు కుట్ర జరుగుతోందన్నారు.