ప్రజావాణి: ఆ సమయంలోపు వచ్చిన వారికే లోనికి అనుమతి

by GSrikanth |
ప్రజావాణి: ఆ సమయంలోపు వచ్చిన వారికే లోనికి అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్‌గా పిలవబడిన ఆ భవనాన్నే ఇప్పుడు ప్రజా దర్బార్‌గా మార్చారు. ఈ భవన్‌లో రోజూ ఉదయం 10 గంటలకు స్వయంగా ముఖ్యమంత్రే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కారం కోసం అధికారులను ఆదేశాలు జారీ చేస్తారు. అయితే, అనూహ్యంగా ప్రజా దర్బార్ పేరును మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇకనుంచి ప్రజావాణిగా నామకరణం చేశారు. అంతేకాదు.. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ ప్రజావాణి నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ఉదయం 10 గంటలలోగా ప్రజాభవన్‌కు చేరుకున్న వారినే లోనికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రజా దర్బార్‌పై కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడటం కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాచరిక పోకడలను తలపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed