తెలంగాణలో పదేళ్లు పవర్ కాంగ్రెస్‌దే: మాజీ MP మధుయాష్కీ గౌడ్

by Satheesh |
తెలంగాణలో పదేళ్లు పవర్ కాంగ్రెస్‌దే: మాజీ MP మధుయాష్కీ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకపాత్ర పోషించింది అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ యువత కీలకపాత్ర పోషించారన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు రాలేదని, అలాంటి వారందరినీ గుర్తుంచుకొని నామినేటెడ్ పోస్టులలో ప్రభుత్వం తగిన అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

పార్టీ, పదవుల్లో 35 శాతం యూత్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీ, ప్రభుత్వ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్టేడియాలన్నీ రాజకీయ , ప్రైవేట్ ఈవెంట్స్ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని, క్రీడాకారులను ప్రోత్సహించలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు శివసేనా రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా క్రీడా కేంద్రాలన్నీటిని సద్వినియోగం చేసుకుంటూ, యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రూ .2 కోట్ల చొప్పున పలు జిల్లాలలో క్రీడా స్టేడియాలు కట్టించినట్లు తెలిపారు. ఇప్పుడు గ్రామాలలో కూడా క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని, యువతను క్రీడల వైపు మళ్లించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed