- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ టూర్ వాయిదా.. జైపాల్ యాదవ్ వైఫల్యమేనా..?
దిశ, రంగారెడ్డి బ్యూరో: ఈనెల 3వ తేదీన కల్వకుర్తి నియోజకవర్గంలోని అమన గల్లులో చేపట్టాల్సిన అభివృద్ది శంకుస్థాపనలు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ స్ధానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరి వల్లే మంత్రి కేటీఆర్ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైయిందని కాంగ్రెస్, బీజేపీలు నిరసనలు చేపడుతున్నారు.
అంతేకాకుండా అమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని శాకిబండ తండాలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్వారీని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మైనింగ్ ఏర్పాటుతో సుమారుగా 5 గ్రామాల్లోని పంట పోలాలపై దుమ్ము, దూళీ పడటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఆనారోగ్యానికి గురవుతున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ మైనింగ్ ఎత్తేసేంత వరకు అధికార పార్టీకి చేందిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను రానివ్వమని బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా అమనగల్లు మున్సిపాలిటీకి రూ.15కోట్ల నిధులు టీయూఎఫ్ఐడీ కింద మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టే పనులను మంత్రి కేటీఆర్ ఈనెల 3వ తేదీన ప్రారంభించే అవకాశం ఉండేది.
కానీ అమనగల్లు మున్సిపాలిటీ పాలక వర్గం మార్చి 31వ తేదీన ఆ నిధుల కింద చేపట్టే పనులను ప్రారంభించడంతో కేటీఆర్ వచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోకుండా నియంత పోకడలతో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గ ప్రజల కోసం పట్టుబట్టి సాధించి నిధులు తెచ్చిన దాఖలాలు లేవు. కేవలం సీడీపీ నిధులతోనే కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఎమ్మెల్యేపై తీవ్ర ఆసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వైఖరీతోనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్లు పెరిగినట్లు కేటీఆర్ గుర్తించినట్లు సమాచారం. అందుకే కేటీఆర్ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది.