Ponnam Prabhakar: వైద్యులు డ్యూటీ లో ఉండి నిరసనలు తెలపాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి

by Ramesh Goud |
Ponnam Prabhakar: వైద్యులు డ్యూటీ లో ఉండి నిరసనలు తెలపాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోల్‌కతా వైద్యురాలి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, డాక్టర్ల నిరసనలకు సంఘీభావం తెలుపుతున్నానని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలి ఘటనపై స్పందించిన ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన నిరసన తెలుపుతున్న డాక్టర్లకు ఓ చేశారు. ఈ సందర్భంగా.. కోల్‌కతాలో వైద్యురాలు పై జరిగిన అత్యాచారం, హత్య నన్ను తీవ్రంగా కలచివేసిందని, సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగిందని, వారికి దేశమంతా అండగా ఉంటుందని చెబుతూ.. ఘటనను తీవ్రంగా ఖండించారు.

వారి కుటుంబానికి న్యాయం జరగాలని చెబుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నాని, వారి నిరసనలు సభభే. కానీ నిన్న ప్రైవేట్ హాస్పటల్ వైద్యులు ఓపీ, అత్యవసర సేవలు బంద్ చేసి నిరసనలు తెలపడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వైద్యులు డ్యూటీలో ఉండి నిరసనలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వైద్యులపై దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టం చేసిందని గుర్తు చేసుకుంటూ.. వారికి మద్దతుగా ఉంటానని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Advertisement

Next Story