ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. మంత్రులు బీజేపీతో టచ్ ఉన్నారన్న వ్యాఖ్యలపై పొన్నం ఫైర్

by Prasad Jukanti |
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. మంత్రులు బీజేపీతో టచ్ ఉన్నారన్న వ్యాఖ్యలపై పొన్నం ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈనెల 14వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. కార్పొరేషన్ పదవులలో ఒకే సమాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయన్న విమర్శలపై స్పందిస్తూ.. 37 చైర్మన్ పదవులకు సంబంధించి అసలు జీవోనే విడుదల కాలేదని చెప్పారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను బీజేపీతో టచ్ లో ఉన్నానని విమర్శించే వాళ్లు ఒళ్ళు, నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. బీజేపీకి టచ్ లో ఉన్న ఐదుగురు మంత్రులు ఎవరో వారిని అడగాలన్నారు. తాను కాలేజీ నుంచి ఏబీవీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశానని అన్నారు. ప్రచారం కోసమే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి డబ్బులు తరలిస్తున్నాన్నది అవాస్తవమన్నారు.

కరీంనగర్ ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. తాము ఎంపీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారు.. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క బలహీన వర్గానికి చెందిన వారు అయిన మీ పార్టీకి అధ్యక్షుడు అయ్యారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాల్సిందని, పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవుల్లో ఒకకరైన బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారా? అని ప్రశ్నించారు. 23 సంవత్సరాల బీఆర్ఎస్ చరిత్రలో బలహీన వర్గాలకు ఒక్క పదవి ఇచ్చిన పరిస్థితి లేదని, బీజేపీ కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అని చెప్పి ఉన్న బీసీ అధ్యక్షుడిని తీసేశారని ధ్వజమెత్తారు. బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 10 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మెమెంతో మకాంత అని కుల గణన తీర్మానాన్ని చేశామని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ బంధు పేరుతో లక్షల అప్లికేషన్లు తీసుకొని కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు గతంలో బీఆర్ఎస్ చేసిందని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story