- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై పొన్నాల లక్ష్మయ్య ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) నేత పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. రైతుల పంటలు ఎండిపోతుంటే.. అసలు ఏమాత్రం పట్టింపులేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్లు అన్నీ నింపితే తొమ్మిది టీఎంసీల నీళ్లు ఉండేవి.. కానీ ప్రభుత్వం అలాంటి పనులు చేయడం లేదని అన్నారు. ఏమైనా బీఆర్ఎస్‌పై బురదజల్లేడమే కాంగ్రెస్ నేతలు(Congress Leaders) పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇంకా పరిపాలనపై కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ అవగాహన రావడం లేదని అన్నారు.
ఇచ్చిన గ్యారంటీలన్నీ అటకెక్కించారని తెలిపారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడం లేదు. స్కూటీలు ఇవ్వడం లేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు.. రైతులకు రుణమాఫీ(RUna Mafi) పూర్తి స్థాయిలో చేయలేదు.. రైతు భరోసా(Rythu Bharosa) కూడా సరిగా అమలు చేయడం లేదు.. రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12 వేల సంగతే మర్చిపోయారు.. ఇలా చెప్పుకుంటూ అనేక హామీలు విస్మరించారని మండిపడ్డారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకొని అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.