- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటి సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని.. కేసీఆర్‌ను గెలిపించారని.. కానీ కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నేరవేర్చలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. తమకు పదవులు ఒక్కటే ముఖ్యం కాదని.. పదవుల కంటే ఆత్మభిమానమే ముఖ్యం అని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ ఫలాలు ఇంకా ఎవరికీ దక్కలేదన్నారు. తెలంగాణ బిడ్డలు రోజు రోజుకు ఆత్మగౌరవాన్ని కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా దక్కలేదని అన్నారు. గత 6 నెలలుగా జూపల్లితో కలసి అనేక సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చాక కొన్ని సర్వేలు చేయించానని.. ఈ సర్వేల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలిందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆరు నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూలై 2వ తేదీన ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి సంచలన ప్రకటన చేశారు.
ఇవి కూడా చదవండి :
పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ఓకే.. ఈటల కూడా వస్తే మంచిది: రేణుకా చౌదరి
Rahul Gandhi: కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు