- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల్లో సత్తా చాటేందుకు పొంగులేటి బిగ్ స్కెచ్! పోటీ అక్కడి నుంచే..?
దిశ బ్యూరో, ఖమ్మం : రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పొంగులేటి మాటే.. ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ఎవరెవరు ఆయన బాటపట్టబోతున్నారు..? ఇవే ఇప్పుడు అన్ని పార్టీల లీడర్ల మదిలో మెదులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి.. ఇంతకూ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారననే చర్చ కూడా తీవ్రం అవుతున్నది. ఇన్నాళ్లూ ఆయన ఖమ్మం లేదా కొత్తగూడెంలో పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా పాలేరు బరిలో నిలుస్తారని ఆయన ముఖ్య అనుచరులు చెబుతుండటం గమనార్హం. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక ఎంపీ స్థానం నుంచి ఈసారి ఆయన వర్గం నుంచి పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటికి భారీగా అనుచరగణం ఉంది. ఏ నియోజకవర్గంలోనైనా తన ప్రభావం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పాలేరు బరిలో నిలిస్తే ఇప్పటికే అక్కడ అధికార పార్టీ నుంచి తుమ్మల, కందాళ ఉపేందర్‌రెడ్డి నేనేంటే నేనంటూ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అధికార పార్టీ కాబట్టే ఇద్దరూ బలంగానే ఉన్నారు. దీనికి తోడు కమ్యూనిస్టులకు సైతం పట్టున్న ప్రాంతం. ఒకవేళ బీర్ఎస్‌తో పొత్తుంటే వారు కూడా అధికార పార్టీకి సహకరించాల్సిందే. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఆ సీటు ఖరారైతే అధికార పార్టీ నేతలు సహకరిస్తారా అన్న చర్చ సైతం ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటికి పాలేరు కలిసొస్తుందనే టాక్ ఊపందుకున్నది. శ్రీనివాసరెడ్డికి భారీగా అనుచరులు ఆ నియోజకవర్గం నుంచే ఉన్నారని, ఆయన గెలుపు అక్కడ నల్లేరు మీద నడకే అంటున్నారు ముఖ్య అనుచరులు.
కారులో కుంపట్ల..
పాలేరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కందాళ, మాజీ మంత్రి తుమ్మల ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటున్నారు. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇద్దరూ అధికార పార్టీ అయినా చెరోదారి.. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పార్టీ సైతం ఇక్కడ చీలిపోయింది.. అంతేకాదు కందాళ వ్యవహార శైలి కూడా కొందరికి గిట్టడం లేదనే ప్రచారం జోరందుకున్నది. ఆయన ప్రధాన అనుచరులు సైతం పలు వ్యవహారాల్లో తలదూర్చి కందాళకు చెడ్డపేరు తెస్తున్నారని, అయినా అనుచరులు చెప్పిందే ఎమ్మెల్యే వింటున్నారని ఆ పార్టీకి చెందిన నాయకులే చెప్పడం విశేషం.
ఇక సీపీఎం నుంచి తమ్మినేని, సీపీఐ నుంచి కూనంనేని సైతం పాలేరు నుంచి బరిలో దిగుతామని గతంలో ప్రకటించారు. ఒకవేళ బీఆర్ఎస్‌తో పొత్తుంటే.. ముఖ్యనాయకులు పైకి సపోర్ట్ చేసినా.. క్షేత్రస్థాయి కమ్యూనిస్టు క్యాడర్ సహకరించే పరిస్థితి లేదు కాబట్టి.. అది కూడా శ్రీనివాసరెడ్డి ఖాతాలో పడే అవకాశాలే ఉన్నాయి.. ఇక పాలేరు బరిలో నిలుస్తానన్న షర్మిల సైతం ఏదైనా ఒప్పందం చేసుకుని ఆయనకు సహకరించొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొంగులేటి ఇక్కడ నుంచి పోటీకి సై అంటున్నారనే చర్చ జరుగుతున్నది.
ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి..
ఖమ్మం మినహా దాదాపు ఇప్పటికే అన్ని నియోజకవర్గాలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి. అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. ఈ క్రమంలో పొంగులేటి ముఖ్య అనుచరులతో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికలు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి అన్ని అవకాశాలను ఉపయోగించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. మరోసారి అన్ని నియోజకవర్గాల్లో తిరిగేలా ప్లాన్ చేసుకున్నారని, ఇలా ఎన్నికల వరకు జనాల్లోనే ఉంటూ వారి మద్దతు కూడాగట్టే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యారు పొంగులేటి అండ్ టీం..
పార్టీలో చేరతారా..? పెడతారా..?
శ్రీనివాసరెడ్డిని అధికార పార్టీ సైతం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆయన ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో వేరే పార్టీలో చేరతారా..? లేక అసంతృప్తులతో పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్తారా అన్న చర్చ జరుగుతున్నది. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీ అని సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బీజేపీలోకి వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నయన్న ఆయన ముఖ్య అనుచరులు ప్రస్తుతం ఎలాంటి చర్చలు పెట్టడం లేదు.. వచ్చే ఎన్నికలకు పొంగులేటి బ్రాండ్ మీదనే పది నియోజకవర్గాల్లో సత్తాచాటి.. ఎన్నికలయ్యాక నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ సైతం ఆయన వర్గంలో సాగుతోందంట.. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇవి కూడా చదవండి: