- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : పొంగులేటి.. ఏమైనా బాంబుల శాఖ మంత్రినా? : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) శ్రీనివాస్ రెడ్డి శాఖ ఏమిటో గాని ఆయనకు బాంబుల శాఖ మంత్రి అని పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంల్ కేటీఆర్(KTR )ఎద్దేవా చేశారు. ఏ బాంబు పేలి కాంగ్రెస్ లో ఎవరు ఎగిరిపోతరో ఆయనకే తెలియాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి మాత్రం పక్కా అని వీళ్లని వదిలిపెట్టమని మరోసారి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7వ తేదీకి ఏడాదవుతుందని, వీళ్లు ఏదో పీకి పందిరేసినట్లుగా ఏడాడి గడిచిందని విజయోత్సవ వారోత్సవాలు చేయాలంటున్నారని, నవంబర్ 29వ తేదీన కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరాహార దీక్ష ప్రారంభించారని, మేం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల వారోత్సవం చేస్తామని త్వరలో డిక్లేర్ చేస్తామన్నారు. ఏ శాఖలో ఎవరెవరిని మోసం చేసి ఎంతెంత తిన్నారో మేం చెబుతామని, పాదయాత్రలు, మిగతా కార్యక్రమాలు తర్వాత ప్రకటిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బీసీ, దళిత బంధు, రైతు బంధు, బీసీ విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పోయిందన్నారు. బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ హామీలను అమలు చేయనందుకు బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే కోసం ఇళ్ళకు వస్తున్న అధికారులను ప్రజలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారన్నారు. బీసీ ఓట్లకు గాలం వేసేందుకు కుల గణన చేస్తామంటున్నారని, 60ఏండ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఓబీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ లబ్ధీ కోసమే తెలంగాణలో బీసీ కులగణన చేపట్టిందని కేటీఆర్ ఆరోపించారు.