- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో జోరుగా పొలిటికల్ బెట్టింగ్ లు.. ఆ మూడు చోట్ల రూ. కోట్లలో పందేలు
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో బెట్టింగ్ ల జోరు పెరిగింది. ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ రూపంలో లక్షల రూపాయాలు చేతులు మారుతుంటే మరో వైపు లోక్ సభ పోలింగ్ కు ముందే పొలిటికల్ బెట్టింగ్ ల జోరు కాక రేపుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం నడుస్తున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల విజయావకాశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి ఆధారంగా బెట్టింగ్ లు మారుస్తున్నట్లు తెలుస్తోంది. గతానికి పూర్తిగా భిన్నమైన ఎన్నికల వాతావరణం ఈసారి ఉండటం, మూడు పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడటం రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది. దీంతో ఆర్గనైజింగ్ గా బెట్టింగ్ లకు పాల్పడేవారు ఆయా పార్టీల నేతలతో తమకు ఉన్న పరిచయాల ఆధారంగా రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు, సొంతంగా తాము వేసుకున్న లెక్కలు, మీడియా కథనాల సమాచారం ఆధారంగా బెట్టింగ్ ల జోరు పెంచినట్లు తెలుస్తోంది. ఈ పందేలు పట్టణాల నుంచి గ్రామీణ స్థాయి వరకు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హాట్ కేక్ లా ఆ మూడు సెగ్మెంట్లు :
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితెలంగాణలో పొలిటికల్ బెట్టింగ్స్ ఆ మూడు చోట్ల రూ. కోట్లలోతుల కారణంగా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధానమైన పోటీ ఉండనుందనే అంచనాకు బెట్టింగ్ రాయుళ్లు వస్తున్నారట. దీంతో ఈ రెండు పార్టీల అభ్యర్థులకు రేషియోలు ఫిక్స్ చేస్తూ భారీ మొత్తంలో బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై రూ. కోట్లలో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, మెదక్ వంటి స్థానాల్లో పార్టీతో పాటు అభ్యర్థులకు రాబోయే మెజార్టీపై రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారట. కొన్ని పార్టీలో చివరి నిమిషంలో పార్టీలు మారిన వారు అభ్యర్థులుగా ఉండటం, నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఆధారంగా పందేలు విలువ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే బెట్టింగ్ రాయుళ్ల వ్యవహారంతో పోలీసులు సైతం అప్రమత్తం అవుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై నజర్ వేస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ కు ముందే బెట్టింగ్ లో జోరందుకోగా పోలింగ్ ముగిశాక పోలింగ్ సరళి అంచనాతో, ఆ తర్వాత వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలతో ఫలితాలపై బెట్టింగ్ లు పందెంగాళ్లు కాళ్లు దువ్వేఅవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.