- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గడువు మరో మూడు రోజులే.. ఆ తర్వాత ఇక బాదుడే
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్ చేసేలా పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు మరో 3 రోజులే మాత్రమే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈ మూడు రోజుల్లో చెల్లించకపోతే ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు మార్చి 31వరకు ట్రాఫిక్ పోలీసులు గడువు విధించారు.
మరో మూడు రోజుల్లో ఆ గడువు ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని, ఈ మూడు రోజుల్లో రాయితీపై చెల్లించుకోవచ్చని స్పష్టం చేశారు. గడువు పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని, అలాంటి ఆలోచన లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై పోలీసులు ప్రకటించిన రాయితీకి భారీ స్పందన వస్తోంది. మార్చి 1 నుంచి రాయితీ ప్రకటించగా.. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల చలాన్లు చెల్లించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం చేకూరింది.