ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పోలీసుల నోటీసులు

by Javid Pasha |   ( Updated:2023-09-27 05:59:29.0  )
ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పోలీసుల నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఆయనకు నోటీసులు ఇవ్వగా.. తీసుకునేందుకు అర్వింద్ నిరాకరించారు. 2020లో కేసు నమోదైతే.. ఇప్పుడు ఎలా నోటీసులు ఇస్తారంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే వెళ్లిపోగా.. ఈ-మెయిల్ లేదా పోస్ట్ ద్వారా ఆయనకు పంపాలని పోలీసులు భావిస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎల్లమ్మగుట్టలో ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో అర్వింద్‌పై నిజామాబాద్ నాలుగో టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు అర్వింద్‌కు మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారనే సమాచారంతో అర్వింద్ దగ్గరికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. కానీ నోటీసులు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు వెనుదిరిగారు.

Advertisement

Next Story