Kodangal: లగచర్ల ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ.. డీజీపీ కీలక ఆదేశాలు

by karthikeya |
Kodangal: లగచర్ల ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ.. డీజీపీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్థులపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే లా అండ్ ఆర్డర్ సమీక్షకు వికారాబాద్ వెళ్లాలని ఏడీజీ మహేష్ భగవత్‌కు డీజీపీ ఆదేశించారు. దీంతో కాసేపట్లో వికారాబాద్‌కు చేరుకోనున్న ఏడీజీ మహేష్ భగవత్.. దాడి ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల నుండి 3 డీసీఎంలతో వచ్చి దాదాపు 50 నుంచి 100కి పైగా మందిని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. గ్రామంలో ప్రతి ఇంటికి తాళం, ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ ఆయన పరిస్థితి ఉంది. అలాగే జామర్లతో సిగ్నల్స్ మొత్తం నిలిపివేయడంతో ఇంటర్నెట్ సదుపాయాలు ఆగిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed