- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పోలీసుల పెత్తనం సరికాదు'
దిశ, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయి. ఇక్కడ పోలీసుల పెత్తనం ఏంటి అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. హన్మకొండ అశోక జంక్షన్ వద్ద బుధవారం కార్యకర్తలతో కలసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను నడిరోడ్డుపై పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెలుతుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్ఎస్ పార్టీ పోలీసులతో ఇలాంటి దాడులు చేయిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పోలీసులు తల దూర్చడం సరికాదన్నారు. నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురి అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్సీ డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.