ఓయో రూమ్స్, లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు..

by Mahesh |
ఓయో రూమ్స్, లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 9 ఫామ్‌హౌస్‌లతో పాటు 39 లాడ్జీలు, ఓయో గదుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫ్యాబ్‌ లాడ్జి, మెరిడియన్‌ హోటల్‌లో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఒకటి మద్యం సేవించేందుకు అనుమతించగా, మరొకటి సరైన పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఫ్యాబ్ లాడ్జి మేనేజర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు మెరిడియన్ హోటల్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇలానే ఆకస్మిక తనిఖీలు నిర్వహాంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story