- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేం పోలీసింగ్?.. ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలపై పోలీసు జులుం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్ తో బుధవారం సెక్రటేరియట్ వద్ద ఆందోళన జరిపిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పశువుల్లా ఈడ్చుకుంటూ తీసుకెళ్లటంతోపాటు చెంపదెబ్బలు కొట్టారు. ఏకంగా డీసీపీ స్థాయి అధికారి చేయి చేసుకోవటం గమనార్హం. పోలీసుల ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సమస్యలపై ఏఎస్ఎఫ్ఐ ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఏఐఎస్ఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకున్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలు, మీడియా, రాజకీయ నాయకులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను రానివ్వద్దంటూ విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్నారు.
నిరసనలో భాగంగా సచివాలయం వద్ద బైఠాయించారు. ఆ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న డీసీపీ వెంకటేశ్వరరావుతోపాటు సిబ్బంది ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలపై విరుచుకు పడ్డారు. బైఠాయించిన నిరసనకారులను పశువుల్లా ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో డీసీపీ వెంకటేశ్వరరావు స్వయంగా పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకుల చెంపలు ఛెళ్లుమనిపించటం గమనార్హం. డీసీపీ చేయి చేసుకోవటంతో సిబ్బంది మరింతగా రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు కొడుతూ పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. వాహనాలు ఎక్కుతుండగా వెనక నుంచి మెడలపై కొట్టటం గమనార్హం. అరెస్టు చేసిన అందరినీ వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, పోలీసుల ఈ వైఖరిని ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు జులం ప్రదర్శించటాన్ని తప్పుపట్టారు. నిరసన తెలియచేసే హక్కు మాకు లేదా? అని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.