- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లస్ కాలే.. మైనస్సే! బండి సంజయ్ అరెస్ట్ ప్లాన్ బెడిసికొట్టిందా?
దిశ, తెలంగాణ బ్యూరో : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వ పరువు పోయిందనే చర్చ బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరుగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీకు ప్లస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిందని ఆందోళన చెందుతున్నారు. టెన్త్ పేపర్ లీకేజీలో కేసులో మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
ఇరికిద్దామని.. ఇరుక్కున్నారు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీకేజీని అస్త్రంగా చేసుకున్నారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. సంజయ్ అరెస్ట్ మొదలుకుని జడ్జి ముందు ప్రవేశపెట్టేవరకు బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బండి సంజయ్ పేపర్ లీకేజీ కోసం కుట్ర చేశారని విమర్శించారు.
అయితే రిమాండ్ రిపోర్టు బయటికి వచ్చిన తర్వాత కుట్రలో సంజయ్ పాత్ర ఎక్కడుందని ప్రశ్నలు వచ్చాయి. పరీక్ష మొదలైన తర్వాత బయటికి వచ్చిన పేపర్ వాట్సాప్ ద్వారా బండి సంజయ్ ఫోన్‌కు వస్తే ఆయన ఎలా కుట్ర చేస్తారని, ప్రభుత్వమే కావాలని ఈ కేసును సృష్టించిదనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ‘ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు ఇలాగే అవుతుంది. మా వాళ్లే ఇరుక్కున్నారు’ అని ఓ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు.
బలవుతున్న అధికారులు...
ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు అధికార పార్టీ పోలీసులను అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒత్తిళ్లకు లొంగి తప్పుడు కేసులు పెడుతున్నారని అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని సైబరాబాద్ పోలీసులు హడావుడి చేసి, కేసులు నమోదు చేశారు. అలాగే ఫామ్ హౌజ్ కేసులో ప్రగతిభవన్ డైరెక్షన్ మేరకు కేసు నమోదు చేసినట్టు విమర్శలు వచ్చాయి. రెండు కేసుల్లో అధికార పార్టీ కోసం పోలీసులు పావులుగా మిగిలారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం టెన్త్ పేపర్ లీకేజీ కేసులో కూడా పోలీసులు నిమిత్త మాత్రులని ప్రగతిభవన్ డైరెక్షన్ మేరకు నడుచుకున్నట్టు ఆరోపణలు వస్తునాయి.