BREAKING: దుబాయ్ బుర్జు ఖలీఫాలో MLC కవితకు ప్లాటు!

by Anjali |
BREAKING: దుబాయ్ బుర్జు ఖలీఫాలో MLC కవితకు ప్లాటు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి రూ. 2 లక్షల కోట్ల ఆస్తులున్నాయని ఆయన ఆరోపించారు. అక్రమ ఆస్తుల, వివరాలను బయటకు తీసి పేద ప్రజలకు పంచుతానని ప్రకటించారు. ఎమ్మెల్సీ కవితకు దుబాయ్ లోని బుర్జు ఖలీఫాలోదాదాపు రూ. 150 కోట్ల విలువచేసే ప్లాటు ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాదులో కూడా ఫాంహౌస్ లు కేసీఆర్ కుటుంబానికి ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ జైలుకెళ్లడం ఖాయమన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా అరెస్టై ఎమ్మెల్యే కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Next Story