ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ

by GSrikanth |
ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ కర్ణాటకలోని పుత్తూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంజీవ మఠందూర్ రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని మహిళతో ఎమ్మెల్యే సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మే 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్రంలో అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలపై బాధిత మహిళ తనకు న్యాయం చేయాలంటూ ఉప్పినంగిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అటు సంజీవ మఠందూరికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని ఆ పార్టీ నేతలే ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా లాబీయింగ్ కూడా నడుస్తోంది. కాగా, ఎన్నికల వేళ పార్టీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప అరెస్ట్ నుంచి బీజేపీ ఇంకా తేరుకోక ముందే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.


Advertisement

Next Story

Most Viewed