- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మనం మనం పోలీసులం.. ఇళ్లలో సోదాలెందుకు?’.. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్?
దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తీరుగుతోంది. ఈ కేసులో ఏ-వన్ గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఈ కేసు వ్యవహారంలో పోలీసులకు టచ్ లోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికానుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ప్రభాకర్ రావు.. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పుడు తాము అలానే ప్రభుత్వం చెప్పిన పనినే చేశామని, ఎంతైనా మనం మనం పోలీసులం, తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తురని ప్రభాకర్ అడిగారని దాంతో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ కి సమాచారం పంపించాలని ఉన్నతాధికారి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారి మాటలతో ఏం సమాధానం చెప్పకుండానే ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ నమోదు అయిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఈ కేసులో తాజాగా ప్రభాకర్ రావును పోలీసులు ఏ-వన్ ముద్దాయిగా చేర్చారు. ఇటీవలే ప్రభాకర్ రావు ఇళ్లలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
నిఘా పెట్టి భారీగా వసూళ్లు!:
ఇక ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటు అందులో ఉన్న సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ప్రణీత్ రావు అండ్ టీమ్ భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న అంశం తాజాగా తెరపైకి వస్తోంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రాజకీయ నాయకుల ఫోన్ లతో పాటు 36 మంది బిల్డర్లు, ప్రముఖ నగల వ్యాపారులు, హవాల ఏజెంట్ల ఫోన్లను ట్యాప్ చేశారని, ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లను సైతం ట్యాప్ చేసి బెదిరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి బాధితుల జాబితాలో ఇంకెంత మంది ఉన్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. రాజకీయ నాయకులే వీరి టార్గెట్ అనుకునే లోపు ఈ మాజీ అధికారుల వ్యవహారంలో కొత్త అంశాలు తెరపైకి వస్తుండటం సంచలనం రేపుతున్నది. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఈ రకమైన వసూళ్లకు పాల్పడ్డారు? వసూలు చేసిన డబ్బంతా ఎక్కడ దాచారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.