- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసు.. గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుపై తరచూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ సహా కీలక నేతలంతా సీబీఐ విచారణ జరిపించేలా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులపై రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేతల బృందం గవర్నర్‌ను కోరింది. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇందులో సూత్రధారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ వదిలి పెట్టినా.. తాము వదిలి పెట్టబోమని అన్నారు.
Advertisement
Next Story