విద్యాశాఖ కమిషనర్‌కు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల వినతి

by GSrikanth |
విద్యాశాఖ కమిషనర్‌కు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల వినతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షను రాష్ట్రంలో ఎన్నికల దృష్య్టా వాయిదా వేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. నవంబర్‌లో జరగవల్సిన గ్రూప్-2 పరీక్షలు ఎన్నికల కారణంతో టీఎస్ పీఎస్సీ జనవరి 6,7 తేదీలకు వాయిదా వేసిందని, డీఎస్సీ పరీక్షను సైతం వాయిదా వేయాలని కోరారు. నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఓటు వేసేందుకు అభ్యర్ధులు గ్రామాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే పరీక్ష సిలబస్ లోనూ మార్పులు చేశారని, అనేక మంది అభ్యర్థులు గ్రూప్ -2 పరీక్షకు సైతం సన్నద్దం అవుతున్నందున గ్రూప్-2 పరీక్ష నిర్వహించిన రెండు నెలల తర్వాత డీఎస్సీ నిర్వహించాలని కోరారు. 13,086 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసి నోటిఫికేషన్ మాత్రం 5,089 పోస్టుల భర్తీ కోసమే విడుదల చేయడం వల్ల చాలా జిల్లాల్లో పోస్టులు లేక అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని అందువల్ల పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పరీక్షను వాయిదా వేయడం, అదపు పోస్టులు జతచేసి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story