ప్రధాని మోడీ నిజాయితేంటో భారత దేశ ప్రజలకు తెలుసు: DK అరుణ

by Satheesh |
ప్రధాని మోడీ నిజాయితేంటో భారత దేశ ప్రజలకు తెలుసు: DK అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలిసి కూడా ప్రధాని మోడీని విమర్శించడం హాస్యాస్పదమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. లిక్కర్ స్కాం విషయంలో నోటీసులు రావడంతో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు ఫ్రస్టేషన్లో నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, ప్రధాని మోడీ నిజాయితీ ఏంటో భారతదేశ ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరక అంటిందనే ప్రస్టేషన్‌లో వారు ఉన్నారని, దీంతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఏమీ లేనప్పుడు భయం ఎందుకు ? విచారణ ఎదుర్కోవాలన్నారు. కవిత నోటీసుల విషయంలో ప్రదాని మోడీకి, ఈడీ‌కి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed