అదానీ విషయంలో అవి ఏవీ వర్తించవు: మంత్రి కేటీఆర్

by Mahesh |   ( Updated:2023-04-13 11:23:35.0  )
అదానీ విషయంలో అవి ఏవీ వర్తించవు: మంత్రి కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు(ఈడీ, సీబీఐ) కీలుబొమ్మలుగా ఎలా మారాయో దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈడీ, సీబీఐ ఎలా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా దర్యాప్తు సంస్థల పై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి.. చాలా విషయాలు బయటపెట్టినందుకు జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను అరెస్టు చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రధాని మోడీకి అవినీతి గురించి మాట్లాడటం చాలా తేలిక. అయితే, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కమీషన్ల వ్యవహారంపై మాత్రం ఆయన స్పందించడం లేదు. అదానీ విషయానికి వస్తే అవినీతిపై ప్రసంగాలు, నిబంధనలు ఏవీ వర్తించవు’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story