- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమర వీరుల కుటుంబాలకు భారీగా పెన్షన్.. కీలక నిర్ణయం దిశగా T- కాంగ్రెస్!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభ సోమవారం జరగనున్నది. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు సభను నిర్వహించనున్నారు. ఈ సభకు చీఫ్ గెస్టుగా కాంగ్రెస్అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారు. దీనిలో ప్రధానంగా యూత్డిక్లరేషన్ప్రకటించనున్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలకు రూ.25 వేలు పెన్షన్ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
పార్టీ అధికారంలోకి రాగానే తొలి, మలి దశ అమర వీరుల కుటుంబాలకు పెన్షన్ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కాంగ్రెస్‌పార్టీలోని ముఖ్య నేతలు తెలిపారు. దీంతో పాటు ఆయా కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాల్లోనూ ప్రత్యేక అవకాశాలు కల్పించే దిశగా కాంగ్రెస్‌పార్టీ అడుగులు వేయనున్నట్లు తెలిసింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ భావిస్తున్నది.
అంతేగాక తొలి, మలి దశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక గుర్తింపు పత్రాలను ఇవ్వనున్నారు. ఇక బిస్వాల్ కమిటీ ప్రకారం ఖాళీలున్న 2 లక్షల ఉద్యోగాలను అధికారంలోకి రాగానే భర్తీ చేయాలని కాంగ్రెస్నిర్ణయం తీసుకున్నది. ప్రతీ ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్చేయనున్నారు.
దీంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు ప్రతీ నెల రూ. 4 వేల రూపాయల ఫించన్‌ను ఇవ్వనున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యార్థుల పూర్తి ఫీజుల చెల్లింపు విధానాన్ని ప్రకటించనున్నారు. యువ, రైతు రాజ్యం కోసం సపరేట్ విధి, విధానాలను అనుసరిస్తామని కాంగ్రెస్లీడర్లు పేర్కొంటున్నారు. అయితే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.