జేటీసీపై దాడి ఎఫెక్ట్.. పెన్ డౌన్‌కు పిలుపునిచ్చిన ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్

by Satheesh |   ( Updated:2024-06-27 15:57:29.0  )
జేటీసీపై దాడి ఎఫెక్ట్.. పెన్ డౌన్‌కు పిలుపునిచ్చిన ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణాశాఖ ఉద్యోగులు శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ రమేష్ చాంబర్‌లోకి చొరబడి ఆయనపై భౌతిక దాడి చేసిన దాడిచేసినట్లు ఉద్యోగులు తెలిపారు. గాయపడిన రమేష్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. జేటీసీపై దాడిని రవాణాశాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. దాడిచేసిన అమానుల్లాఖాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఛాంబర్‌లో జేటీసీపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణాశాఖ ఉద్యోగులు పెన్ డౌన్‌కు పిలుపు నిచ్చారు. నిరసనలకు ఉద్యోగ సంఘాలు పిలుపు నిచ్చాయి.

ఈ సందర్భంగా టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లెంల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. జేటీసీపై దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడిచేసిన అమానుల్లఖాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారిపై దాడి హేయమైన చర్య అన్నారు. ఇలాంటి దాడులతో ఉద్యోగులు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం, గ్రూప్-1 అధికారుల సంఘం, కానిస్టేబుళ్ల సంఘం, టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జేటీసీపై దాడిని ఖండిస్తూ పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు.

తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. జేటీసీపై దాడి హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడిచేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జేటీసీపై దాడి చేసిన ఆటో డ్రైవర్ అమానుల్లాఖాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రవాణాశాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలోనూ అధికారులపై అమనుల్లాఖాన్ దాడిచేసినట్లు ఉద్యోగులు తెలిపారు. ఆర్టీఓ మానిక్ ప్రభు, వెంకటేశ్వర్లుపై కూడా దౌర్జన్యం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినట్లు వివరించారు. ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస రెడ్డి, రామకృష్ణ, అరుణేంద్ర ప్రసాద్, ఎంజులా రెడ్డి, శ్రీనివాస్ తదితరులు తెలిపారు.

Advertisement

Next Story