ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఎగురవేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by Mahesh |
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఎగురవేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో గాంధీ భవన్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని.. స్వంతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఎక్కడ లేదని, వల్లభాయ్ పటేల్‌తో బీజేపీకి సంబంధం ఏంటిని... పటేల్‌ను బీజేపీ తన నాయకుడిగా చెప్పుకుంటుందని విమర్శించారు. తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. అలాగే పదేళ్లు తెలంగాణను కేసీఆర్ తుంగలో తొక్కారని, కేటీఆర్‌కు సంస్కారం లేక రాజీవ్ విగ్రహంపై మాట్లాడుతున్నాడని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed