- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పు ప్రచారం.. నాగం ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ సాయంత్రం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్న ప్రెస్‌మీట్ అంశం సర్వత్ర ఉత్కంఠకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీలో తనతో సంప్రదించకుండా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి ని చేర్చుకోవడం, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ లో చేర్చుకొని ప్రాధేయతను ఇస్తుండడం పట్ల నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలం నుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నాగర్ కర్నూల్ లో జరిగిన ముఖ్య నేతల సమీక్ష సమావేశాలలోనూ ఆయన పార్టీ కండువా వేసుకోకుండా పాల్గొనడం, పలు సందర్భాలలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు.
నాగర్ కర్నూల్ నుండి టికెట్టు తనకు కాకుండా కొత్తగా చేరిన రాజేష్ రెడ్డికి ఇస్తారు అని ప్రచారం జరుగుతుండడం నాగం ను మరింత కృంగదీసింది. ఈ నేపథ్యంలో నాగం పార్టీ మారతారు అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే 2018 ఎన్నికలలో అధికార పార్టీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక చెల్లదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని మరోసారి మీడియా ముందు ప్రస్తావిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆధారాలతో, అనుభవజ్ఞులైన విశ్రాంత ఇంజనీరింగ్ అధికారులతో వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అని మరికొందరు అంటున్నారు. మొత్తం పై నాగం జనార్దన్ రెడ్డి ఈ నాలుగు గంటలకు నిర్వహించనున్న ప్రెస్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ ను కలిగిస్తోంది.