Panagariya: ప్రణాళికలు బాగున్నాయి.. తెలంగాణ విజ్ఞప్తులపై పనగారియా కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Panagariya: ప్రణాళికలు బాగున్నాయి.. తెలంగాణ  విజ్ఞప్తులపై పనగారియా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా అన్నారు. మంగళవారం ప్రజా భవన్ లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిందని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అన్ని అంశాలు కమిషన్ కు వివరించిందని పనగారియా వెల్లడించారు. తెలంగాణ ప్రణాళికలు బాగున్నాయని పట్టణాభివృద్ధిని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తారు కానీ తెలంగాణ పట్టణాభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సెస్, సర్ చార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరిందన్నారు. మంచి పని తీరు కనబరిచిన రాష్ట్రాలకు నష్టం జరుగుతోందనే అభిప్రాయాన్ని తెలంగాణ వ్యక్తం చేసిందని అందువల్ల తమకు ప్రోత్సాహకం ఇవ్వాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కోరాయన్నారు. 15వ ఆర్థిక సంఘం డివిజబుల్ పూల్ లో 1 శాతం నిధులు సిఫారసు చేసింది. ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. కానీ 30 శాతం అంటున్నారని పనగారియా తెలిపారు. తమ సమావేశంలో రుణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించిందని, ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, వినతులు తీసుకున్నామని, రాష్ట్రా వాటా నిధుల పెంపుపై దృష్టి పెట్టాలని కోరారన్నారు. కమిషన్ సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది కానీ నిధులపై కేంద్రం ఆలోచన విధానాన్ని తాము ప్రశ్నించలేమన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు సిఫార్సు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed