- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana: నిజామాబాద్ జిల్లాలో ‘పక్షిరాజు’
దిశ వెబ్ డెస్క్: నిత్య జీవితంలో మనం ఎన్నో పక్షులను చూస్తుంటాం. అయితే ఆ పక్షులకు నాలుగు గింజలు వేసి గుక్కెడు నీళ్లు పోయడానికి సైతం మనలో చాలామందికి చేతులు రావు. దాని పర్యవసానమే గతంలో మన కళ్లముందు తిరిగిన ఎన్నో పక్షులు ప్రస్తుతం కనుమరుగైయ్యాయి. కాని కొందరు ప్రకృతి ప్రేమికులు ప్రకృతిలో భాగమైన పక్షులను సైతం అక్కున చేర్చుకుని వాటి ఆలనా,పాలనా చూస్తున్నారు.
ఈ కోవలోకే వస్తారు నిజామాబాద్ జిల్లాకు చెందిన జీవన్‌రావు. జీవన్‌రావు గతంలో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా మానవతాదృక్పదంతో ఆలోచించిన ఆయన పక్షుల సంరక్షణకై కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్షులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. దీని కోసం ఆయన పనికి రాని వస్తువులను సేకరించి, వాటితో ఆకర్షణీయమైన గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
టీచర్‌గా రిటైర్ అయ్యిన ఆయన హాయిగా ఇంట్లో కూర్చోని కాలక్షేపం చేయకుండా, ఇలా పక్షుల సంరక్షణకై పాటుపడుతుండడంతో ఆయనపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలానే ఆయనను ‘పక్షిరాజు’ అని కొనియాడుతున్నారు.