Osmania: కొత్త చట్టాలతో మీడియా స్వేచ్ఛకు ఆపద.. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది షమ్స్ ఖ్వాజా

by Ramesh Goud |
Osmania: కొత్త చట్టాలతో మీడియా స్వేచ్ఛకు ఆపద.. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది షమ్స్ ఖ్వాజా
X

దిశ, డైనమిక్ బ్యూరో:కొత్త క్రిమినల్ చట్టాలతో మీడియా స్వేచ్ఛకు ఆపద కలిగి ఉందని, జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులను అనుమతించే మేరకు చట్టాన్ని గౌరవించాలి అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది షమ్స్ ఖ్వాజా అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో విద్యార్ధులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా హజరైన ఆయన కొత్త చట్టాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్ చట్టాల్లో కొన్ని సెక్షన్లు వ్యాఖ్యానానికి విస్తృత పరిధికి అనుమతిస్తూ.. పాత్రికేయ స్వేచ్ఛను ప్రమాదంలో పడేశాయని అన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కొన్ని చట్టాలు జర్నలిస్టులు నివేదించిన వాస్తవాలతో పోలిస్తే అధికారిక ‘అవగాహన’కు ఎక్కువ విలువనిస్తాయమని తెలిపారు.

భారత శిక్షాస్మృతి సెక్షన్ 93 నిబంధనల ప్రకారం చిత్తశుద్ధి మరియు ప్రజా ప్రయోజనాల కోసం చేసిన కమ్యూనికేషన్ నేరం కాదు. కానీ మీడియా కథనం అధికారిక వెర్షన్‌కు భిన్నంగా ఉంటే, కొత్త చట్టాలు జర్నలిస్టులను శిక్షించగలవని అన్నారు. అలాగే బ్రిటీష్ కాలం నాటి ఉప్పు చట్టం మరియు జలియన్ వాలాబాగ్ ఊచకోత సంఘ్లటనలను ఉటంకిస్తూ.. చట్టం సహేతుకమైన చర్యలను, చట్టవిరుద్ధం చేయగలదని చెప్పారు. భారతీయ న్యాయ స్మృతిలోని అధ్యాయం 7 సెక్షన్ 145లో కూడా రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం గురించిన నిబంధనలు అటువంటి గతిశీలతను కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులను అనుమతించే మేరకు చట్టాన్ని గౌరవించాలని అలాగే దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. అంతేగాక న్యాయస్థానాలు కుడా పాత్రికేయ స్వేచ్ఛను సాధారణంగా పౌరులకు వర్తించే దానికంటే విస్తృత పరిధిని ఆపాదించాలి అని షమ్స్ ఖ్వాజా సూచించారు.

Advertisement

Next Story