ORR: ఓఆర్ఆర్ నుంచి అదుపుతప్పి పడిపోయిన లారీ.. డ్రైవర్ సజీవ దహనం

by Ramesh Goud |   ( Updated:2024-12-04 07:09:46.0  )
ORR: ఓఆర్ఆర్ నుంచి అదుపుతప్పి పడిపోయిన లారీ.. డ్రైవర్ సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: ఓఆర్ఆర్(ORR) పై అర్థరాత్రి ఘోర ప్రమాదం(Terrible Accident) జరిగింది. లారీ(Lorry) అదుపుతప్పి కింద పడగా.. డ్రైవర్(Driver) అక్కడికక్కడే మరణించాడు(Died). మియాపూర్(Miyapur) నుంచి బండ్లగూడ(Bandla Guda)కు వెళ్తున్న చెత్తను తీసుకెళ్లే లారీ గౌడవెళ్లి(Gowdavelli) సమీపంలో అదుపు తప్పి ఓఆర్ఆర్ మీద నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ నుంచి మంటలు చెలరేగడంతో డ్రైవర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనం(Burnt Alive) అయ్యాడు. లారీ కూడా మంటల్లో పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్ సందీప్(27) గా పోలీసులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed