- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SLBC Tunnel Rescue Operation : ఆపరేషన్ SLBC... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం లెప్ట్బ్యాంక్ కెనాల్(SLBC) టన్నెల్ నిర్మాణ పనుల్లో కొంతభాగం పైకప్పు కూలి 8 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న వారికోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఆదివారం నేవీ(Navy), ఆర్మీ(Army) దళాలు రంగంలోకి దిగగా.. నేడు మరో ముఖ్యమైన టీంను రంగంలోకి దించింది ప్రభుత్వం. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Miners) ను పిలిపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు మైనర్స్.. నేడు మరికొద్దిసేపట్లో ప్రమాద స్థలానికి చేరుకొనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా ప్రభుత్వం, ప్రత్యేక దళాలు 17 రోజులు ప్రయత్నించినా వారిని బయటికి తీసుకు రాలేక పోయారు. అనంతరం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపగా వారిని ఒక్కరోజులోనే బయటికి తీసుకు వచ్చారు. బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బొరియలు చేసినట్టు తవ్వి భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం అయినప్పటికీ.. ఇపుడు వారే ఇలాంటి ప్రమాదాల్లో సహాయక చర్యలకు తోడ్పడుతున్నారు.