Gold Loan: బంగారం రుణాల కోసం కఠినమైన రూల్స్ .. ఇక లోన్ కష్టమేనా?

by Vennela |
Gold Loan: బంగారం రుణాల కోసం కఠినమైన రూల్స్ .. ఇక లోన్ కష్టమేనా?
X

దిశ, వెబ్ డెస్క్: Gold Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గోల్డ్ లోన్స్(Gold Loan) కోసం కఠినమైన నిబంధనలు తెస్తోంది. చాలా మంది లోన్ ఇచ్చేవాళ్లు బంగారం విలువ కట్టడానికి, లోన్ చేయడానికి వేరే వాళ్ల మీద ఆధారపడుతున్నారు. కొన్ని పద్దతులు తనఖా పెట్టిన ఆస్తికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాయి. బంగారం లోన్(Gold Loan) వ్యవహారాల్లో ఏవీ సక్రమంగా జరగడం లేదు. అంతేకాదు లోన్ తీసుకున్నవాళ్లు తిరిగి కట్టగలరా లేదా అని కూడా చూడటం లేదని ఆర్బిఐ గుర్తించింది.

కొన్ని ఫైనాన్స్ కంపెనీ(Finance company)లు పూర్తి వివరాలు సరిగ్గా చెక్ చేయడం లేదు. దీని వల్ల లోన్ కట్టకపోతే రిస్క్ మరింత ఎక్కువగా అవుతుంది. తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేయడంలో కూడా నిజాయితీగా ఉండటం లేదు. ఆస్తులు అమ్మే ముందు లోన్ తీసుకున్నవాళ్లకు సరిగ్గా చెప్పడం లేదు. దీని వల్ల ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే కచ్చితంగా పర్యవేక్షించాలని ఆర్బిఐ చెబుతోంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లోన్ టు వ్యాల్యూ రేషియోలు(Loan to Value Ratios)ను కూడా సరిగ్గా చూడటం లేదు. బంగారం లోన్ బిజినెస్ పెరిగే కొద్దీ రిస్క్ అంచనా సరిగ్గా లేకుంటే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్స్ సంస్థలు కరెక్ట్ ఎల్టీవీ రేడియోలు(LTV Radios) వాడుతున్నాయో లేదో చూడాలని ఆర్బిఐ అనుకుంటోంది. ఈ సమస్యలు తీర్చడానికి, లోన్ ఇచ్చే వాళ్లందరూ వాళ్ల బంగారం లోన్ పాలసీ(Gold Loan Policy)లను మార్చుకోవాలని, లోపాలు సరిద్దిద్దుకోవాలని, పర్యవేక్షణ పెంచాలని ఆర్బిఐ(RBI) అంటోంది.

తప్పులు జరగకుండా, మోసాలు జరగకుండా వేరే సర్వీస్ ఇచ్చే వాళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లోన్ తీసుకున్నవాళ్లతో ఫైనాన్స్ సంస్థలు(Finance company) టచ్ లో ఉండాలి. వేలం తిరిగి కట్టే విషయంలో నిబంధనలు నిజాయితీగా ఉండాలి. మార్పులు చేయడానికి లోన్ ఇచ్చేవాళ్లకు మూడు నెలలు సమయం ఇవ్వాలి. లేదంటే వాళ్ల మీద చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త నిబంధనల వల్ల బాధ్యతగా లోన్ ఇవ్వడం, తీసుకన్న వాళ్ల హక్కులు కాపాడటం బంగారం లోన్ బిజినెస్ సక్రమంగా జరగడం వంటివి జరుగుతాయి. కఠినమైన నిబంధనలు(Strict regulations) పెట్టడం వల్ల , బంగారం మీద ఇచ్చే లోన్స్ కు ఒక నమ్మకమైన సిస్టమ్ తయారు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చూస్తోంది.

Next Story

Most Viewed