- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
by Kalyani |

X
దిశ, ఇబ్రహీంపట్నం : చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంకు చెందిన సింగారం మధు స్థానిక మున్సిపాలిటీలో వాటర్ మెన్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం నుంచి కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు తూము వద్ద మధు పర్సు, చెప్పులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు, డిఆర్ఎఫ్ బృందం సాయంతో సుమారు 4 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి, చెరువులో నుంచి మధు మృతదేహం వెలికితీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story