Weather:మండుటెండల్లో చల్లటి కబురు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

by Jakkula Mamatha |
Weather:మండుటెండల్లో చల్లటి కబురు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయాన్నే ఎండలు మండి పోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఉష్ణోగ్రత(temperature)లు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణ(Telangana)లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో నమోదైనట్లు తెలిపింది. ఈ మండుతున్న ఎండలతో పాటు వడగాలుల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Next Story

Most Viewed