Raghunandan Rao : ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావాలి : ఎంపీ రఘునందన్ రావు

by M.Rajitha |
Raghunandan Rao : ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావాలి : ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : సామాజిక సేవలో ముందుండే ఆర్యవైశ్యులు(AryaVaishyas) రాజకీయాల్లోకి రావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) కోరారు. ఆదివారం హైదరాబాద్(Hyderabad) లోని ఆర్యవైశ్యుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్యవైశ్యులు రకరకాల పేర్లతో పిలవబడతారం, సేవాగుణంలో అందరికంటే ముందు ఉంటారని పేర్కొన్నారు. అంతటి సేవాగుణం, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే భారతీయ జనతా పార్టీ(BJP) పుట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అపర చాణక్యుడు అని, 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చారని తెలిపారు. మోడీ 3 సార్లు ప్రధాని కావడానికి తాను ఎంతో సహకరించినట్టు తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని నడిపేది మోడీ వంటి రాజకీయ నాయకులే అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Next Story

Most Viewed