శంకర్‌పల్లి‌లో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభం

by Satheesh |
శంకర్‌పల్లి‌లో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: శంకర్‌పల్లిలో తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీ సెంటర్ చందన బ్రదర్స్ వారు మరో బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సినీ తార నేహాశెట్టి చేతులమీదుగా శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. శంకర్‌పల్లి పరిసర ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ వంటి నగరాలవరకు వెళ్ళి షాపింగ్ చేసుకునే అవసరం లేకుండా అదే అంతర్జాతీయ షాపింగ్ వసతులను అందిస్తూ కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలను హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. ప్రారంభోత్సవవ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నామని, అలాగే సుమారు 150 మందికి పైగా ఉపాది కలిపిస్తున్నామని పేర్కొన్నారు. మమ్మల్ని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed