- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV: బ్రేకింగ్.. ఆర్జీవీకి నోటీసులిచ్చిన ఒంగోలు పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఒంగోలు పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయల్దేరి వచ్చిన పోలీసులు (Ongole Police).. ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన కుటుంబంతో పాటు.. జనసేన అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ పై ఎక్స్(X) లో అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలులో కేసు నమోదైంది. ఒంగోలు జిల్లా మద్దిపాడు స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఎస్సై శివరామయ్య కేసు నమోదు చేసి.. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి డైరెక్ట్ గా నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి దీనిపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ (Posani Krishna Murali) పైనా కేసు నమోదైంది. విజయవాడ భవానీపురం పోలీసులకు (Bhavanipuram Police Station) జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సెప్టెంబర్ 28, 2021న, ఏప్రిల్ 22న 2024న వైసీపీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై పోసాని తీవ్ర విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల్ని వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తూ.. పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.